రైతుబంధు ఇప్పించండి సారూ

ABN , First Publish Date - 2020-05-16T10:08:13+05:30 IST

రైతుబంధు డబ్బులు ఇప్పించాలంటూ ఓ రైతు కలెక్టర్‌ వాహనం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం

రైతుబంధు ఇప్పించండి సారూ

కరీంనగర్‌లో కలెక్టర్‌ కారు ఎదుట కూర్చుని నిరసన 


సుభాష్‌నగర్‌, మే 15: రైతుబంధు డబ్బులు ఇప్పించాలంటూ ఓ రైతు కలెక్టర్‌ వాహనం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల చిన్న వెంకటయ్య కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకొని తమకు రైతుబంధు కింద ఆర్థిక సాయం  అందించాలంటూ అధికారులను వేడుకున్నారు.


అదే సమయంలో కలెక్టర్‌ శశాంక్‌ బయటకు వెళ్తుండగా ఆయన వాహనానికి అడ్డంగా వెంకటయ్య, ఆయన భార్య, కుమారుడు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యను తెలుసుకోవడానికి వారి వద్దకు వచ్చిన కలెక్టర్‌ గన్‌మన్‌ కాళ్లు మొక్కి దండం పెట్టి వేడుకున్నారు.


బొమ్మనపల్లి గ్రామంలో తనకున్న 4ఎకరాల 27 గుంటల భూమిని సాగు చేసుకుంటుండగా తమకు రైతుబంధు డబ్బులు రావడం లేదని వాపోయారు. స్పందించిన కలెక్టర్‌ ఫైలును హైదరాబాద్‌ పంపించామని తొందరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలుపడంతో వారు వెళ్లిపోయారు. 

Updated Date - 2020-05-16T10:08:13+05:30 IST