రైతుసంఘం ఆందోళన ఉద్రిక్తం

ABN , First Publish Date - 2020-12-04T06:21:11+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని రైతులకు మద్దతుగా గురువారం స్థానిక రైతులు, కౌలుదారు లతో కలిసి సీపీఎం చేపట్టిన ఆందోళన గురువారం ఉద్రిక్తంగా మారింది.

రైతుసంఘం ఆందోళన ఉద్రిక్తం
రైతులు, సీపీఎం నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు

గన్నవరం, డిసెంబరు 3: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని రైతులకు మద్దతుగా గురువారం స్థానిక రైతులు, కౌలుదారు లతో కలిసి సీపీఎం చేపట్టిన ఆందోళన గురువారం ఉద్రిక్తంగా మారింది. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో జాతీయ రహదారిపై బైఠాయించడానికి ప్రయత్నిం చిన వందలాది మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసు జులుం నశించాలని నినా దాలు చేస్తూ ఆగిరిపల్లి రోడ్డుపై ప్రదర్శన చేశారు. జిల్లా కార్యదర్శి ఆర్‌ రఘు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు వై.నరసింహారావు మాట్లాడుతూ రైతుల ఉసురు తీసే ప్రభుత్వాలకు పతనం తప్పదని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.హరిబాబు, అధ్యక్షుడు టీవీ లక్ష్మణస్వామి, సీపీఎం నేతలు కళ్ళం వెంకటేశ్వరరావు, మల్లంపల్లి జయమ్మ, బేతా శ్రీనివాసరావు, ఆజ్మీర వెంకటేశ్వరరావు, మాతంగి ఆంజనేయులు, వై.నాగలక్ష్మీ పాల్గొన్నారు.

మైలవరం, జి.కొండూరులో..

మైలవరం, జి.కొండూరు : రైతులకు నష్టం కల్గించేలా కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కార్య వర్గ సభ్యుడు రావూరి రామారావు డిమాండ్‌ చేశారు. అఖిల పక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వ ర్యంలో ఏఎంసీ ఎదుట జాతీయ రహదారిపై రాస్తా రోకో చేశారు. రైతు సంఘం మండల కార్యదర్శి వజ్రా ల వెంకటరెడ్డి, లంక వెంకటేశ్వరరావు, రామారావు, ముత్తయ్య, బుడ్డి రమేష్‌, వాసులు పాల్గొన్నారు. అ లాగే జీ కొండూరులో చేపట్టిన రాస్తారోకోను భగ్నం చేసేందుకు పోలీసులు వామపక్ష నేతలను గృహని ర్బంధం, అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని సీపీఐ నేత గూడూరు శ్రీనివాసరెడ్డి అన్నారు. కె.వెంక టేశ్వరరావు, యు.నరసింహారావు, లక్ష్మయ్య, సుబ్బా రావు పాల్గొన్నారు. 

ఉయ్యూరులో నేతల గృహ నిర్బంధం

ఉయ్యూరు : సీపీఎం, రైతు సంఘ నేతలను గురువారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో జరిగే ధర్నాకు వెళ్లనీయకుండా సీపీఎం నేత కె.శివనాగేంద్రం, రైతు సంఘ నేతలు అన్నే సుబ్బా రావు, నెమ్మాది కొండలును ఉదయం నుంచి గృహనిర్భందం ఉంచారు.

ఢిల్లీ రైతులకు సంఘీభావంగా..

ఇబ్రహీంపట్నం : కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఢిల్లీలో రైతుల ఆందోళనకు సంఘీభావంగా రింగ్‌ సెంటర్‌లో సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. సీఐటీయూ హాకర్స్‌ యూనియన్‌ నేతలు జి.రమణమ్మ, జి.మల్లేష్‌, లైలా, బాబురావు, రామరావు, నవీన్‌, ప్రభుదాస్‌ నాయడు పాల్గొన్నారు.

రైతుల పోరాటానికి మద్దతు : ఆళ్ల 

మొగల్రాజపురం : ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర నీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ గురువారం కస్తూరిబాయి పేటలోని కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. 


Updated Date - 2020-12-04T06:21:11+05:30 IST