Sep 21 2021 @ 16:36PM

119 అశ్లీల వీడియోలు.. రూ.9 కోట్లు

బాలీవుడ్‌లో నీలి చిత్రాల కేసులో నిందితుడైన వ్యాపారావేత్త రాజ్‌కుంద్రాకు ఇటీవల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఆ కేస్‌పై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. విచారణలో భాగంగా రాజ్‌కుంద్రా ఫోన్‌, లాప్‌టాప్‌, హాట్‌డ్రైవ్‌ డిస్క్‌లను పరిశీలించామని... వాటిల్లో మొత్తం 119 నీలి చిత్రాల వరకూ స్టోర్‌ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ వీడియోలను రాజ్‌కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు పోలీసులు తెలిపారు. 

ఫిబ్రవరి నెలలో ముంబై శివారులోని ఓ బంగ్లాలో పోర్న్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో అక్కడి పోలీసులు దాడి చేయగా ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీనితో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్‌ రాకెట్‌’ గుట్టు రట్టు చేశారు. అయితే ఈ అవమానంతో రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టి కొన్నాళ్లు తను చేస్తున్న షూటింగ్‌లకు గైర్హాజర్‌ అయిన సంగతి తెలిసిందే!. ఈ మధ్యనే ఆమె మళ్లీ షూటింగ్‌ల్లో అడుగుపెడుతోంది. శిల్పా తన భర్తతో తెగతెంపులు చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 


Bollywoodమరిన్ని...