Oct 19 2021 @ 16:20PM

షెర్లిన్‌ చోప్రాపై 50 కోట్ల పరువు నష్టం దావా

రాజ్‌కుంద్రా, శిల్పా శెట్టి తరఫు న్యాయవాదులు షెర్లిన్‌ చోప్రాపై 50 కోట్ల రూపాయిలు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల జుహు పోలీస్‌ ేస్టషన్‌లో షెర్లిన్‌ చోప్రా రాజ్‌కుంద్రా దంపతులపై కేస్‌ ఫైల్‌ చేశారు. రాజ్‌ కుంద్రా లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆ కేసులో పేర్కొంది. దాంతో రాజ్‌ కుంద్రా షెర్లిన్‌పై పరువు నష్టం దావా వేశారు. షెర్లిన్‌ నిరాధారమైన ఆరోపణలు చేస్తుందనీ, అబద్దాలు మాట్లాడుతోందని కేవలం మా పరువు తీేసందుకు, దోపిడీ చేయడానికి ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. స్ర్టీమ్‌ యాప్‌కు సంబంధించిన వ్యవహారాలో శిల్పా శెట్టికి సంబంధం లేదని ఆయన తెలిపారు. ‘‘భారతీయ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నా’’ రాజ్‌కుంద్రా అన్నారు. Bollywoodమరిన్ని...