Abn logo
Sep 20 2021 @ 18:36PM

రాజ్ కుంద్రా ఔట్... శిల్పా భర్తకు బెయిల్...

ముంబై : వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త... రాజ్ కుంద్రాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ముంబైలోని స్థానిక కోర్టు ఆయనకు 50 వేల రూపాయల పూచీపై సోమవారం బెయిల్ మంజూరు చేసింది.


పోర్నోగ్రఫి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కుంద్రాతో పాటూ రయాన్ తోర్పేను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన సైతం బెయిల్‌పై జైలు నుంచీ బయటకు వచ్చారు. తనని సరైన సాక్ష్యాలు లేకుండానే పోర్నోగ్రఫి కేసులో బలిపశువును చేస్తున్నారంటూ రాజ్ కుంద్రా బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన తరుఫు లాయర్ వాదనకి సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి బెయిల్‌ ఇచ్చేందుకు అంగీకరించారు.

ఇవి కూడా చదవండిImage Caption