Jul 23 2021 @ 13:27PM

రాజ్ కుంద్రాకు మరో షాక్..!

ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియోస్ వ్యాపారం చేస్తున్నాడంటూ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రాను రీసెంట్‌గా ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌కుంద్రాపై కొంద‌రు న‌టీమ‌ణులు ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు అనుకోని షాక్ త‌గిలింది. ఇంత‌కీ రాజ్‌కుంద్రాకు త‌గిలిన ఎదురుదెబ్బ ఏంట‌నే వివ‌రాల్లోకెళ్తే..తెలుగులో హీరోగా న‌టించిన ముంబైకి బిజినెస్‌మేన్ స‌చిన్ జోషి రాజ్‌కుంద్రాతో చేస్త‌న్న లీగ‌ల్ పోరులో విజయం సాధించాడు. 

అప్ప‌ట్లో స‌త్య‌యుగ్ అనే కంపెనీకి చైర్మ‌న్‌గా ఉన్న రాజ్ కుంద్రా బంగారంపై ఆదాయం అందిస్తామంటూ స్కీమ్ పెట్టాడు. దాన్ని న‌మ్మిన స‌చిన్ జోషి కిలో బంగారాన్ని ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌గా పెట్టాడు. ఐదేళ్లు పూర్త‌యిన త‌ర్వాత స‌చిన్ జోషీకి బంగారం తిరిగి ఇవ్వ‌కుండా రాజ్‌కుంద్రా కంపెనీ అడ్డుగోలుగా వ్య‌వ‌హ‌రించింది. దీనిపై స‌చిన్ జోషి కోర్టుకెళ్లాడు. కేసుని ప‌రిశీలించిన న్యాయ‌స్థానం..రాజ్‌కుంద్రా కంపెనీ స‌చిన్‌కు రూ.25 ల‌క్ష‌ల 50 వేలు చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది. ‘నిజం ఏదో ఒక‌రోజు బ‌య‌ట‌కు వ‌స్తుంది’ అంటూ కోర్టు తీర్పు అనంత‌రం స‌చిన్ జోషి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.