Jun 18 2021 @ 22:46PM

అదే నా శపథం! శ్రీవిష్ణు

శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. శుక్రవారం టీజర్‌ విడుదల చేశారు. పైకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిలా కనిపించే దొంగగా శ్రీవిష్ణు, దొంగను పట్టుకోవాలని తాపత్రయపడే పోలీ్‌సగా రవిబాబు కనిపించారు. టీజర్‌లో వచ్చే నేపథ్య గీతం, ‘బహుపరాక్‌’ డైలాగ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ‘దీనికి సొల్యూషన్‌ చెప్పనా?’ అనే డైలాగ్‌ను మళ్లీ మళ్లీ సునయనతో చెప్పించి, సినిమాపై ఆసక్తి కలిగించారు.


‘‘ప్రేక్షకులు పడి పడి నవ్వుకునేలా చేసే వినోదాత్మక చిత్రమిది. ఇటీవల గంగవ్వ వాయి్‌సతో విడుదలైన ‘చోర గాథ’కు, ఇప్పుడీ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అని నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ చెప్పారు. ‘‘ఈ పాత్రతో మీ ముందుకు రావడం నా అదృష్టం. ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం’’ అన్నారు శ్రీవిష్ణు. తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ చిత్రంలో ఇతర తారాగణం. హసిత్‌ గోలి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: వివేక్‌ సాగర్‌.