Abn logo
Aug 11 2020 @ 08:48AM

రాజశేఖర్ చేస్తుంది రీమేక్ సినిమానా?

‘పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌’తో హిట్ కొట్టి ట్రాక్‌లోకి వ‌చ్చిన సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌కు ‘క‌ల్కి’ ఆశించిన స్థాయి విజ‌యాన్ని అందించ‌లేదు. దీంతో ఆయ‌న త‌దుప‌రి సినిమా చేయ‌డానికి చాలా స‌మ‌యాన్నే తీసుకున్నారు. ఇంత వ‌ర‌కు రాజ‌శేఖ‌ర్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన ఊసే లేదు. అయితే ఓ త‌మిళ నిర్మాత, ద‌ర్శ‌కుడుతో రాజ‌శేఖ‌ర్ సినిమా చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. అలాగే వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రితో రాజ‌శేఖ‌ర్ సినిమా ఉంటుంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఏదీ అనౌన్స్‌మెంట్ వ‌ర‌కు వెళ్లలేదు. అయితే తాజాగా నీలకంఠ దర్శకత్వంలో శివానీ శివాత్మిక, ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మాతలుగా రాజశేఖర్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రం మలయాళ చిత్రం ‘జోసెఫ్’కు రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement