జగన్‌కు.. రైతుల కష్టాలు పట్టవా

ABN , First Publish Date - 2020-12-03T05:50:11+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ రైతుల కష్టాలను గమనించకుండా అందరినీ శత్రువుల్లా చూస్తూ పోలీసుల రక్షణతో సచివాల యానికి వెళ్లడం సిగ్గుచేటని తెలుగు మహిళా రాష్ట్ర అధ్య క్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.

జగన్‌కు.. రైతుల కష్టాలు పట్టవా
దొండపాడు శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ధ్వజం

 351వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్షలు


తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, డిసెంబరు 2: ముఖ్యమంత్రి జగన్‌ రైతుల కష్టాలను గమనించకుండా అందరినీ శత్రువుల్లా చూస్తూ పోలీసుల రక్షణతో సచివాల యానికి వెళ్లడం సిగ్గుచేటని తెలుగు మహిళా రాష్ట్ర అధ్య క్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తోన్న ఆందోళనలు బుధవారానికి 351వ రోజుకు చేరు కున్నాయి. ఈ సందర్భంగా తుళ్లూరు మండలం మందడం, వెలగపూడి, తుళ్లూరు, పెదపరిమి,  మంగళగిరి మండలం కృష్ణాయపాలెం దీక్షా శిబిరాలను సందర్శించి వారికి అనిత సంఘాభావం తెలిపి ప్రసంగించారు. అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌కు కనీసం చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దౌర్భాగ్య మన్నారు.  రైతుల ఉద్యమానికి అండగా ఉన్న న్యాయవ్యవస్థ కు తాము రుణపడి ఉంటామన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు చెప్పిన వైసీపీ మూక ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమరావతికి 30 వేల ఎకరాలు కావాలని, అది కూడా  విజయవాడ దగ్గర్లో ఉం డాలని చెప్పిన జగన్‌ నేడు మూడు ముక్కల ఆట మొదలు పెట్టి అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాల వేసుకుని, దైవత్వానికి విలువ లేకుండా చేశారన్నారు. బూతుల మంత్రి కొడాలి నాని సంగతి చెప్పే పని లేదన్నారు. రేపు అమ్మా ఓటు వేయండని అడుగుతాడా..? లేక ఇంకో రకంగా అడుగుతాడో తెలియదన్నారు. పోలీసులు జగన్‌కి కాపాలా కాయడం కోసం, రైతులు, టీడీపీ నేతల మీద కేసులు పెట్టటానికి మాత్రమే పని చేస్తున్నారన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండ వల్లి శ్రీదేవి ఇంత మంది రైతులు, మహిళలు రోడ్డు మీద పడి ఏడుస్తుంటే, వారి బాధలు పట్టించుకోవడంలేదన్నారు.


ఒక్క అవకాశమని... ముక్కలు

ఒక్కసారి అవకాశం ఇవ్వండని గద్దెనెక్కిన జగన్‌ అన్నీటిని ముక్కలు చేస్తూ అభివృద్ధిని అటకెక్కించారని  రైతులు తెలి పారు. 351వ రోజు దీక్షా శిబిరాల్లో వారు మాట్లాడుతూ అమ రావతితో పాటు అన్ని వ్యవస్థల్నీ నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ పాలకులకు దక్కుతుందన్నారు. ఆఖరికి ఇసుకను పొ రుగు రాష్ట్రాలకు అమ్ముకుని, ఇక్కడ లేకుండా చేసి భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారన్నారు. మందడం శిబిరానికి పోలీసులు అడ్డుగా ఉండటంతో సీఎం కాన్వాయ్‌ వచ్చేటప్పుడు రోడ్డు పక్కన ఉన్న డాబాల పైకి మహిళలు ఎక్కి ఆకుపచ్చ జెండాలతో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అబ్బరాజుపాలెం, బోరుపాలెం, తుళ్లూరు, దొండపా డు, అనంతవరం, పెదపరిమి, ఉద్దండ్రాయునిపాలెం, ఐనవో లు, కృష్టాయపాలెం, బేతపూడి, యర్రబాలెం, పెనుమాక, మం దడం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం రైతు ధర్నా శిబిరాల్లో దీక్షలు కొనసాగాయి. ఈ కార్యక్రమాల్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, గుంటూరు పార్ల మెంట్‌ టీడీపీ మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి పాల్గొన్నారు. తాడేపల్లి మండలం పెనుమాక, తాడికొండ మండలం మోతడక గ్రామాల్లో దీక్షా శిబిరాలు కొనసాగాయి.  


Updated Date - 2020-12-03T05:50:11+05:30 IST