అమరావతిని కాదంటే అమ్మను కాదన్నట్లే

ABN , First Publish Date - 2021-03-03T05:15:56+05:30 IST

రాజధాని అమరావతిని కాదంటే అమ్మను కాదన్నట్లేనని రైతులు, మహిళలు తేల్చి చెప్పారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 441వ రోజుకు చేరుకుంది.

అమరావతిని కాదంటే అమ్మను కాదన్నట్లే
వెలగపూడి శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు


మూడు రాజధానులపై పాలకుల పంతం  

441వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు


తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, మార్చి 2: రాజధాని అమరావతిని కాదంటే అమ్మను కాదన్నట్లేనని రైతులు, మహిళలు తేల్చి చెప్పారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 441వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని, అమరావతి కూడా ఐదు కోట్ల మందిదన్నారు. కన్న తల్లి లాం టి భూములు ఇచ్చినప్పుడు అభి వృద్ధి కొనసాగించాలే కాని, నాశనం చేయకూడదన్నారు. ఉద్యమాన్ని అణచి వేయాలని, అమరావతిని నిర్వీర్యం చేయాలని, మూడు రాజధానుల పంతం నెగ్గించుకోవాలని పాలకులు అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా రాజధాని గ్రామానికి ఆను కుని ఉన్న క్వారీలో భారీ పేలుళ్లు జరిపించి   అమరావతిలో భూకం పం వచ్చిందనే అపోహలను జగన్‌ మీడియాలో ప్రచారం చేయించారన్నారు. అమరావతిపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. అహింసా మార్గంలో ఉద్యమం చేస్తుంటే కక్ష కట్టి కేసులు పెట్టి.. భయబ్రాంతు ల కు గురి చేయాలని జగన్‌, మంత్రు లు, ఎమ్మెల్యేలు శత విధాలుగా ప్ర యత్నిస్తున్నారన్నారు. క్వారీలో జరి గిన పేలుళ్లపై అనంతవరం రైతులు తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. పేలుళ్ల ధాటికి ఇంటి పునాదులు కదులుతున్నాయని, క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యా దులో పేర్కొన్నారు. తు ళ్లూరు మండల పరిధి లోని గ్రామాలతో పాటు తాడేపల్లి మండలం పెనుమాకలో నిరసన దీక్షలు కొనసాగాయి. రాజఽ దాని రైతులకు మద్దతుగా తాడికొం డ మండలం మోతడక గ్రామ రైతు లు, మహిళలు మంగళవారం నిరస నలు చేపట్టారు. సీఎం జగన్‌ మన స్సు మారాలని మోతడక రైతు లు చేపట్టిన పాదయాత్ర మంగళవారా నికి చిలకలూరిపేటకు చేరుకున్నది. 


అమరావతిపై దుష్ప్రచారం

అమరావతిలో భూకంపం వచ్చిందని పాలకులు దుష్ప్రచారం చేశారని అమరావతి జేఏసీ కన్వీనర్‌  పువ్వాడ సుధాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే ఎన్‌జీఆర్‌ఏ నివేదికను బహిర్గతం చేయాలన్నా రు. వెలగపూడి రైతు జేఏసీ కార్యాలయంలో అమరావతి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో గాయకుడు రమ ణ విశాఖ ఉక్కు ఉద్యమం కోసం రూపొందించిన పాటల సీడీని ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ భూకంపం నెపం తో అమరావతిని నాశనం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నినట్టు ఆరోపించారు. అ మరావతి ఉద్య మ సెగ తగలాలని మంత్రులు కోరుకుంటే ఐదు నిమిషాల్లో చూపిస్తామన్నారు. శాంతి, అహిం స అనే పునాదుల మీద ఉద్య మం నిర్మించామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. 


 

Updated Date - 2021-03-03T05:15:56+05:30 IST