Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతిని నిర్వీర్యం చేస్తే అనర్థమే

 711వ రోజు దీక్ష శిబిరాల్లో రైతులు 


తుళ్లూరు, నవంబరు 27: రాజధాని అమరావతిని నిరీర్వం చేస్తే అనర్థమే అని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 711వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతిని నాశనం చేయాలనే ఒకే ఒక్క సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. అమరావతినే ఐదుకోట్ల మంది కోరుకుంటున్నారు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. మూడు రాజధానుల బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని తెలిసి కూడా మరలా పెడతామనడం విచారకరమని పేర్కొన్నారు. ఇంకా మొండిగా ముందుకు వెళతామని అనుకుంటే, ప్రజలు తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని రైతులు పేర్కొన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.  దీపాలు వెలిగించి  జై అమరావతి అంటూ నినాదాలు చేశారు .

Advertisement
Advertisement