Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతిపై కుట్రలు మానుకోవాలి

713 రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, నవంబరు 29: ఇకనైనా పాలకులు అమరావతిపై కుట్రలు చేయడం మానుకోవాలని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఆందోళనలు  సోమవరంతో 713 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ తమ వైపు పూర్తి న్యాయం ఉందని,  అందుకే మహాపాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. సొంత ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన ఐదు కోట్ల మంది ప్రజలు తిరస్కరించారన్నారు. పాలకులు మారినప్పుడల్లా రాజధాని మారదని తెలిపారు. అందరూ కోరుకునేది ఆంధ్రప్రదేశ్‌ అమరావతి అన్నారు. రాజధాని 29 గ్రామాల్లో దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు.   

 

Advertisement
Advertisement