Abn logo
Sep 18 2021 @ 00:45AM

అమరావతి అభివృద్ధిని కొనసాగించాలి

తుళ్లూరులో నినాదాలు చేస్తున్న మహిళలు

640వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, సెప్టెంబరు 17: అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు. అమరావతి ఉద్యమం శుక్రవారంతో 640వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదన కేవలం అమరావతిని నాశనం చేయడానికి సీఎం జగన్‌ వేసిన ఎత్తుగడన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడానికి చేస్తున్న కుట్రే మూడు రాజధానులన్నారు. అభివృద్ధి చేయడం చేతకాక రాజధానికి ఇచ్చిన భూములను అడవిగా మారుస్తున్నారని రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.