Abn logo
Sep 26 2021 @ 00:01AM

అందలం ఎక్కగానే మాట తప్పారు..

నీరుకొండ శిబిరంలో నిరసన తెలుపుతున్న మహిళలు, రైతులు

అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు..

దానిని కాపాడుకుంటాం..

648వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు 

 

తుళ్ళూరు, సెప్టెంబరు 25: అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నామని అందుకు 30 వేల ఎకరాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కావాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన సీఎం జగన్‌రెడ్డి అందలం ఎక్కగానే అమరావతిని నిర్వీర్యం చేయటానికి పూనుకొన్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజఽధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని కోరుతూ వారు చేపట్టి ఉద్యమం శనివారం 648వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల్లో రైతులు మాట్లాడుతూ  సీఎం జగన్‌ది రెండు నాలుకల ధోరణి అని ఆరోపించారు. కౌళ్లు కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. భూములిచ్చినందుకు రైతులను రోడ్డున  వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అభీష్టం మేరకు పాలన చేయాలని హితవు పలికారు. ఇప్పటికైనా అమరావతిని అభివృద్ధిని కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్‌ ఇచ్చినవారవుతారని పేర్కొన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి నినాదాలు చేశారు.