Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబును కలవడానికి వెళ్లను: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాజమండ్రి: తాను చంద్రబాబును కలవడానికి వెళ్లనని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ఉదయం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుచ్చయ్య చౌదరితో టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, జవహర్‌తో పాటు మరికొందరు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయరని తెలిపారు. తామందరం కలిసి చంద్రబాబును కలుస్తామని ఆయన చెప్పారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం పట్టు విడవటం లేదు. తాను చంద్రబాబును కలిసేందుకు వెళ్లనని చెప్పారు. తన నిర్ణయాన్ని బహిరంగంగానే త్వరలో ప్రకటిస్తానని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ‘‘30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. ఆత్మగౌరవం ముఖ్యం. ఎన్టీఆర్ ఆత్మగౌరవం అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆత్మగౌరవ నినాదాన్నే ఇప్పటివరకూ పాటించా. మళ్లీ ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తాం.’’ అని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. 


Advertisement
Advertisement