సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-08-02T06:46:05+05:30 IST

సామాజిక రక్షణ చట్టం తెచ్చి రజక వృత్తిదారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.భాస్కరయ్య డిమాండ్‌ చేశారు

సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి

  ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.భాస్కరయ్య

గుడివాడటౌన్‌, ఆగస్టు 1 : సామాజిక రక్షణ చట్టం తెచ్చి రజక వృత్తిదారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.భాస్కరయ్య డిమాండ్‌ చేశారు. బంటుమిల్లి రోడ్‌లోని రజక చెరువు దగ్గర ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సం ఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో భాస్కరయ్య మాట్లాడారు.  రజక వృత్తి చేస్తున్న మహిళలు, బాలికలపై అత్యాచారాలు మితిమీరుతున్నా ప్రభుత్వాధికా రులు అడ్డుకట్టవేయలేక పోతున్నారని వాపోయారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడులో వికలాంగురాలైన రజక మహిళపై జరిగిన అత్యాచార సంఘటనే నిదర్శనమన్నారు. రజకుల ఓట్లు దండుకుని అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వాలు రజకుల పట్ల శ్రద్ధ  చూపటం లేదన్నారు. ఇప్పటికైనా రజకుల రక్షణకు సామా జిక రక్షణ చట్టం ఏర్పాట చేయాలని కోరారు. రజకుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో రజక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాయన్నారు. రజక వృత్తి దారులకు ఇంత  వరకు రెండోసారి రూ.10వేలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. చేనేత వృత్తిదారులకు ఇస్తున్న విధంగా 50 ఏళ్లు నిండిన రజక వృత్తిదారులకు పింఛను మంజూరు చేయాలని, రజక చెరువులు, దోబీఘాట్‌ స్థలాల పూర్తి హ క్కు రజకులకు కల్పించాలని,    రజక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.  జిల్లా కార్యదర్శి కాటూరి నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు పెడసనగంటి పాండు రంగారావు, గుడివాడ సంఘం అధ్యక్షుడు పి.వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T06:46:05+05:30 IST