తేలిన.. ‘పంచాయితీ’!

ABN , First Publish Date - 2021-01-05T05:07:08+05:30 IST

రాజాంలో 15 ఏళ్లుగా కొనసాగుతున్న నగర ‘పంచాయితీ’ సమస్యకు పరిష్కార మార్గం దొరికింది. రాజాంను నగర పంచాయతీగా ప్రకటించిన మునిసిపల్‌ పరిపాలన శాఖ అప్పట్లో కొన్ని పంచాయతీలను విలీనం చేయడంతో వివాదాలు తలెత్తాయి. ఈ సమస్య కోర్టులో ఉండడంతో ఇన్నాళ్లూ అధికారుల పాలనే కొనసాగుతోంది. ఎట్టకేలకు రాజాంను నగర పంచాయతీగా ప్రకటిస్తూ రాష్ట్ర గవర్నర్‌ గత నెల 31న ఆర్డినెన్స్‌ (రాజపత్రం)జారీ చేశారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరగకపోవడంతో ఆర్డినెన్స్‌ రూపంలో గవర్నర్‌ గెజిట్‌లో నమోదు చేశారు. ఈమేరకు రాజాం నగర పంచాయతీ కమిషనర్‌కు సోమవారం ఆర్డినెన్స్‌ కాపీ చేరింది. దీంతో వివాదాలకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లయింది.

తేలిన.. ‘పంచాయితీ’!
రాజాం నగర పంచాయతీ

రాజాం.. నగర పంచాయతీగా గ్రీన్‌సిగ్నల్‌

ఆర్గినెన్స్‌ జారీ చేసిన గవర్నర్‌ 

15 ఏళ్ల సమస్యకు పరిష్కారం

(రాజాం రూరల్‌)

రాజాంలో 15 ఏళ్లుగా కొనసాగుతున్న నగర ‘పంచాయితీ’ సమస్యకు పరిష్కార మార్గం దొరికింది. రాజాంను నగర పంచాయతీగా ప్రకటించిన మునిసిపల్‌ పరిపాలన శాఖ అప్పట్లో కొన్ని పంచాయతీలను విలీనం చేయడంతో వివాదాలు తలెత్తాయి. ఈ సమస్య కోర్టులో ఉండడంతో ఇన్నాళ్లూ అధికారుల పాలనే కొనసాగుతోంది. ఎట్టకేలకు రాజాంను నగర పంచాయతీగా ప్రకటిస్తూ రాష్ట్ర గవర్నర్‌ గత నెల 31న ఆర్డినెన్స్‌ (రాజపత్రం)జారీ చేశారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరగకపోవడంతో ఆర్డినెన్స్‌ రూపంలో గవర్నర్‌ గెజిట్‌లో నమోదు చేశారు. ఈమేరకు రాజాం నగర పంచాయతీ కమిషనర్‌కు సోమవారం ఆర్డినెన్స్‌ కాపీ చేరింది. దీంతో వివాదాలకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లయింది.

 ఇదీ కఽథ...

2005లో రాజాంను నగర పంచాయతీగా మునిసిపల్‌ పరిపాలనా శాఖ ప్రకటించింది. రాజాం, సారఽథి మేజర్‌ పంచాయతీలతో పాటు సమీప కొత్తవలస, కొండంపేట, సంతకవిటి మండలంలోని పొనుగుటివలస పంచాయతీలను రాజాం నగర పంచాయతీగా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొత్తవలస, కొండంపేట, పొనుగుటివలస పంచాయతీల సర్పంచిలు అప్పటి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. పదవీ కాలం ముగియక ముందే ప్రభుత్వం పంచాయతీలను సంప్రదించకుండా.. సర్పంచిల ఆమోదం లేకుండా రాజాం నగర పంచాయతీలో విలీనం చేయడాన్ని సరికాదన్నారు. ఈ నేపథ్యంలో యథాతథస్థితిని (స్టేటస్‌కో) కొనసాగించాలని న్యాయస్థానం అప్పట్లో తీర్పునిచ్చింది. ఫలితంగా 15 ఏళ్లుగా అధికారుల పాలనలోనే కొనసాగుతోంది. సుధీర్ఘ వాదనల తరువాత న్యాయస్థానం ఈ కేసును 2019లో రాష్ట్ర  ప్రభుత్వానికి తిప్పి పంపింది. నగర పంచాయతీగా కొనసాగించాలా, పంచాయతీలుగా కొనసాగించాలా? మీరే తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కేబినెట్‌లో చర్చించడం ద్వారా మీరు తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో కోర్టునాశ్రయించిన మూడు పంచాయతీలకు ప్రత్యేకాధికారులను రాష్ట్ర ప్రభుత్వం 2020లో నియమించింది. ప్రత్యేకాధికారుల సారఽథ్యంలో గ్రామసభలు ఏర్పాటు చేసి నగర పంచాయతీలో కొనసాగేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తీర్మానాలు చేశారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకాధికారులు పంపించారు. అటు న్యాయస్థానం నుంచి, ఇటు కోర్టును ఆశ్రయించిన పంచాయతీల నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో సంతృప్తి చెందిన గవర్నర్‌ రాజాంను నగర పంచాయతీగా నిర్ధారిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. ఐదు గ్రామాలను 20 వార్డులుగా నిర్ధారిస్తూ ప్రకటించారు. 

Updated Date - 2021-01-05T05:07:08+05:30 IST