స్టార్‌తో మాట్లాడుతున్నాననే భావన కలగలేదు:రాజమౌళి

"ఎదుటి వ్యక్తికి చిన్న సాయం చేస్తేనే ప్రపంచం మొత్తానికి తెలియాలనుకునే రోజులివి. కానీ పునీత్‌ రాజ్‌కుమార్‌ అలా కాదు. వేలమంది సాయం చేసినా బయటకు రానివ్వలేదు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం’’ అని ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. ఆయన మరణం తనని కలచివేసిందని అన్నారు. తాజాగా బెంగళూరుకు వెళ్లిన ఆయన పునీత్‌ ఇంటికి వెళ్లారు. పునీత్‌ చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. ‘‘నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. పునీత్‌ మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్‌ని కలిశాను. సొంత మనిషిలా చూసుకున్నారు. స్టార్‌ హీరోతో మాట్లాడుతున్నాననే భావన నాకు కలగలేదు. పునీత్‌ మరణ వార్త విని ఎంతో షాక్‌ అయ్యాను. ఆయన ఎంతోమందికి సాయం చేశారని  మరణం తర్వాతే అందరికీ తెలిసింది’’ అని రాజమౌళి అన్నారు.

Advertisement