Abn logo
Jun 3 2020 @ 22:10PM

‘ఆర్ఆర్ఆర్‌’ కోసం భారీ విలేజ్ సెట్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల బడ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ప‌ది భాష‌ల్లో సినిమా తెర‌కెక్కుతోంది. క‌రోనా ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా వెన‌క్కి వెళ్లేలా ఉంది. లాక్‌డౌన్ వ‌ల్ల ఆగిపోయిన సినిమాల షూటింగ్స్‌ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌బోతున్నారు. అందులో ముందుగా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమానే సెట్స్‌పైకి వెళ్లేలా ఉంది. ఈ షెడ్యూల్ కోసం గండిపేట‌లో జ‌క్క‌న్న అండ్ టీమ్ భారీ సెట్ వేయ‌బోతున్నార‌ట‌. ఈ సెట్ విలువ రూ.18 కోట్లు ఉండ‌వ‌చ్చున‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement