కరోనా ప్రభావంతో ఏర్పడ్డ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. దాదాపు రెండు నెలల తర్వాత షూటింగ్లను షురూ చేయడానికి సినీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. మరి భారీ క్రూతో తెరకెక్కించాలనుకుంటున్న సినిమాల్లోని సన్నివేశాల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అందరి మదిలోనూ ఉత్పన్నమవుతుంది. ఇలాంటి తరుణంలో భారీ బడ్జెట్, తారాగణంతో రూపొందుతోన్న ‘రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)’ షూటింగ్ విషయంలో రాజమౌళి కొత్త ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఎక్కువ మంది సభ్యులు లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తారట. డిసెంబర్ తర్వాత ఎక్కువ మంది సభ్యులున్న సన్నివేశాలను చిత్రీకరిస్తారని వార్తలు వినపడుతున్నాయి. దీని వల్ల కాస్త షూటింగ్ త్వరగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందిగా.