Oct 24 2021 @ 16:38PM

Rajanikanth: ఆయన లేకపోవడం చాలా బాధగా ఉంది

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం పట్ల సూపర్‌స్టార్‌  రజనీకాంత్‌ మరోసారి సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రజనీకాంత్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇంత ప్రతిష్ఠాత్మక అవార్డు నన్ను వరిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఆనంద సమయంలో నా గురువు కె.బాలచందర్‌ మన మధ్య లేకపోవడం నాకెంతో బాధగా ఉంది’’ అని రజనీ భావోద్వేగానిరి లోనయ్యారు. అయితే రేపు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని ఆయన తెలిపారు. అవార్డును అందుకోవడంతోపాటు తన కుమార్తె సౌందర్య విఘ్నేశ్‌ ఎంతో కష్టపడి తయారు చేసిన ‘హూట్‌ యాప్‌’ని తాను విడుదల చేయనున్నట్లు రజనీకాంత్‌ చెప్పారు.