8 నుంచి రాజన్న దర్శనం.?

ABN , First Publish Date - 2020-06-05T11:01:07+05:30 IST

వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో 8వ తేదీ నుంచి భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఆలయ అధికారులు

8 నుంచి రాజన్న దర్శనం.?

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు

లఘుదర్శనంకు మాత్రమే అవకాశం


వేములవాడ, జూన్‌ 4: వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో 8వ తేదీ నుంచి భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఆలయ అధికారులు ఏర్పా ట్లు దాదాపు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే పక్షంలో  సోమవారం నుంచి గంటకు 200 మంది భక్తులకు స్వామివారి లఘుదర్శనం అవకాశం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్‌ ని యంత్రణలో భాగంగా మార్చి 19 నుంచి రాజన్న ఆలయంలో భక్తులకు దర్శ నాలను నిలిపివేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడ లించి జూన్‌ 8 నుంచి ప్రార్థనా మందిరాలలో భక్తులకు అనుమతించవచ్చని స్పష్టం చేయడంతో భక్తులు ఆలయంలోని కోడెమొక్కులు, దర్శనం క్యూలైన్లలో భౌతికదూరం పాటించే విధంగా దూరం దూరంగా డబ్బాలను గీశారు. 


కోడెమొక్కులపై ఆంక్షలు..?

భక్తు లను దర్శనానికి అనుమతించే పక్షంలో కేవలం లఘుదర్శనంకు మాత్రమే అ వకాశం ఉంటుందని, ఆర్జిత సేవలకు ఇప్పట్లో అవకాశం ఉండబోదని తెలు స్తోంది. రాజన్న ఆలయంలో ప్రత్యేకమైన కోడెమొక్కు సమర్పణ, తలనీలాల సమర్పణతో పాటు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆలయ పరిసరాలను శానిటేషన్‌ చేయ డంతో పాటు థర్మల్‌ స్ర్కీనింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆలయం లో భక్తులను అనుమతించే అంశంపై ఇంకా తమకు ఆదేశాలు రాలేదని ఆల య ఏఈవో డి.ఉమారాణి తెలిపారు. అనుమతి లభించిన వెంటనే భక్తులకు దర్శనం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. 

Updated Date - 2020-06-05T11:01:07+05:30 IST