రాజన్న సిరిసిల్లలో తప్పించుకున్న చిరుత

ABN , First Publish Date - 2021-01-14T17:55:53+05:30 IST

మాల్కపూర్‌లోని ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన చిరుత పులి తప్పించుకుంది.

రాజన్న సిరిసిల్లలో తప్పించుకున్న చిరుత

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయినపల్లి మండలం, మాల్కపూర్‌లోని ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన  చిరుత పులి తప్పించుకుంది. బావిలో బొరియ ఉండడంతో చిరుత ఆచూకి దొరకలేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ రాత్రంతా బావివద్ద కాపలా కాసింది. బావిలోకి నిచ్చెనలు వేయడంతో పైకి వెళ్లి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. చిరుత మళ్లీ తప్పించుకోవడంతో  స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


చిరుతను పట్టుకోవడం కోసం చేసిన ఆపరేషన్ కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ మళ్లీ చిరుత తప్పించుకోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరుత తప్పించుకుని ఎక్కడికి వెళ్లిందన్నదానిపై పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. చిరుత అడుగు జాడలను పరిశీలించారు. అయితే ఈ పరిశీలనలో సంచలన విషయాలు తెలిసాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతంలో మొత్తం నాలుగు చిరుత పులులు సంచరిస్తున్నాయని చెప్పారు. చుట్టుప్రక్కల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2021-01-14T17:55:53+05:30 IST