Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్ని పార్టీల్లో ఉన్నట్లే బీజేపీలోనూ గ్రూపులు: రాజాసింగ్

హైదరాబాద్‌: అన్ని పార్టీల్లో ఉన్నట్లే బీజేపీలోనూ గ్రూపులున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తాను ఏ గ్రూప్‌లోనూ లేనని అయితే బండి సంజయ్ నాయకత్వాన్ని సమర్థిస్తానన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాతే బీజేపీ బలపడిందన్నారు. బండి సంజయ్‌పై కొన్ని ఒత్తిళ్లు వాస్తవమేనన్నారు. బీజేపీలో చేరికలను జాతీయ నాయకత్వం చూసుకుంటోందన్నారు. బీజేపీలో చేరికలను వ్యతిరేకిస్తే వారికే నష్టమన్నారు. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదన్నారు. మాజీ మంత్రి ఈటల ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలోకి వస్తారని రాజాసింగ్ వెల్లడించారు.

Advertisement
Advertisement