Covid-19: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ తప్పదన్న సీఎం

ABN , First Publish Date - 2021-05-07T01:05:58+05:30 IST

కోవిడ్-19 సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపివేస్తోంది. గతేడాది ప్రభావంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. గత 15 రోజులుగా ప్రతిరోజు 3 లక్షలకు పైగానే కోవిడ్ కేసులు వస్తున్నాయి. కాగా గురువారం కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..

Covid-19: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ తప్పదన్న సీఎం

జైపూర్: కోవిడ్ మహమ్మారిని అరికట్టాలంటే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ఒక్కటే మార్గమని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఆక్సీజన్ కొరత, బెడ్ల కొరత తీవ్రంగా ఉందని, లాక్‌డౌన్ కనుక విధించకపోతే దేశంలో వైద్యుల కొరత వస్తుందని ఆయన అన్నారు. లాక్‌డౌన్ తప్ప మన ముందు మరే మార్గం లేదని, లేదంటే పరిస్థితులు మరింత తీవ్ర స్థాయిలోకి దిగజారి పోతాయని గెహ్లోత్ పేర్కొన్నారు.


గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని రాహల్ గాంధీ చేసిన సూచనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మనముందు ఇదొక్కటే మార్గముందని నేను అనుకుంటున్నాను. లేదంటే మరో ఏడాది దాటితే డాక్టర్లు, వైద్యబృందం కొరత మన దేశాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే మనం చాలా మందిని కోల్పోయాం. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే’’ అని అన్నారు.


కోవిడ్-19 సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపివేస్తోంది. గతేడాది ప్రభావంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. గత 15 రోజులుగా ప్రతిరోజు 3 లక్షలకు పైగానే కోవిడ్ కేసులు వస్తున్నాయి. కాగా గురువారం కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో ఇండియాలోనే సగం ఉన్నాయని పేర్కొంది.

Updated Date - 2021-05-07T01:05:58+05:30 IST