రాత్రి పూట పొలం నుంచి తిరిగొస్తున్న మహిళ.. రోడ్డు పక్కన సిమెంట్ పైపులో ఎవరో ఉన్నట్టుగా అలికిడి.. ఏంటా అని ఆమె వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-10-26T19:28:16+05:30 IST

పొలంనుంచి కట్టెలమోపు ఎత్తుకుని..

రాత్రి పూట పొలం నుంచి తిరిగొస్తున్న మహిళ.. రోడ్డు పక్కన సిమెంట్ పైపులో ఎవరో ఉన్నట్టుగా అలికిడి.. ఏంటా అని ఆమె వెళ్లి చూస్తే..

ఇంటర్‌నెట్‌డెస్క్: పొలంనుంచి కట్టెలమోపు ఎత్తుకుని ఇంటికి బయలు దేరింది ఓ మహిళ. చీకటి పడడంతో.. నిదానంగా వెళ్తోంది. ఆ సమయంలో ఆమెకు రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ పైపు దగ్గర నుంచి కుక్కల అరుపులు వినిపించాయి. ఏంటి కుక్కలు ఇంతలా అరుస్తున్నాయని అటుగా వెళ్లింది. అక్కడ ఉన్నది చూసి గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని మరికొంతమంది అక్కడకు వచ్చారు. అక్కడకొచ్చిన వాళ్లు కూడా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ కట్టెలమోపు తీసుకుని పొలం నుంచి ఇంటికి వెళ్తోంది. ఆమె ఇంటికి వెళ్లేసమయంలో రోడ్డుపక్కన ఉన్న సిమెంట్ పైపు దగ్గరి నుంచి కుక్కల అరుపులు వినిపించాయి. ఏంటి కుక్కలు ఇంతలా అరుస్తున్నాయని కట్టెలమోపును ఓ చోట పెట్టి అక్కడకు వెళ్లింది. సిమెంట్ పైపులో ఉన్నది చూసి ఆమె గట్టిగా అరిచింది. ఆమె అరుపులకు చుట్టుపక్కల వాళ్లు కూడా ఆ సిమెంట్ పైపు దగ్గరకు వచ్చారు.



ఎవరో ఓ 25ఏళ్ల అమ్మాయిని హత్య చేసి ఆ సిమెంట్ పైపులో ఉంచి వెళ్లినట్టున్నారు. ఆ అమ్మాయి మృతదేహాన్ని చూసే ఆ గ్రామీణ మహిళ గట్టిగా అరిచింది. అయ్యో.. పాపం అంటూ ఏడ్చించి. అక్కడికి వచ్చినవాళ్లలో ఒకతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చారు.


సదర్ పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ దేవిలాల్ మాట్లాడుతూ హత్యకు గురైన అమ్మాయికి 25ఏళ్లు ఉంటాయని అన్నారు. మృతదేహాన్ని గమనిస్తే శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, ఎవరో ఆమె ముక్కుకు వస్త్రం అడ్డుపెట్టి చంపేసి ఉంటారని భావిస్తున్నామన్నారు. చనిపోయిన అమ్మాయి ఒంటిపై నల్లటి కుర్తా, ఆకుపచ్చ లెగ్గిన్ ఉన్నాయని, కుటిచేతి మీద పచ్చబొట్టు ఉందని, బంగారు ముక్కు పుడుక ఉందని చెప్పారు. చిత్తోర్‌గఢ్-భిల్వారా హైవే రోడ్డు కల్వర్టు కింద డ్రైనేజికి సంబంధించిన నిర్మాణం జరుగుతుందని, ఎవరో ఆ అమ్మాయిని చంపి కారులో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్లారన్నారు. సంఘటనా స్థలంలోని ఆధారాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారని, మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.





Updated Date - 2021-10-26T19:28:16+05:30 IST