ద్రవిడ్‌తో ఆ రోజు ఇప్పటికీ నా జీవితంలో బెస్ట్ డే: సంజు శాంసన్

ABN , First Publish Date - 2021-04-13T01:39:41+05:30 IST

ఇక ఐపీఎల్ తనకు ఎంతో ఇచ్చిందని, ఇన్నేళ్లుగా ఐపీఎల్‌లో కొనసాగడం చాలా ఆనందంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ తాజా సంజు శాంసన్ చెప్పాడు. ఐపీఎల్‌లో తన కెరీర్‌‌తో చాలా సంతోషంగా ఉన్నానని అన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో..

ద్రవిడ్‌తో ఆ రోజు ఇప్పటికీ నా జీవితంలో బెస్ట్ డే: సంజు శాంసన్

చెన్నై: ఇక ఐపీఎల్ తనకు ఎంతో ఇచ్చిందని, ఇన్నేళ్లుగా ఐపీఎల్‌లో కొనసాగడం చాలా ఆనందంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ తాజా సంజు శాంసన్ చెప్పాడు. ఐపీఎల్‌లో తన కెరీర్‌‌తో చాలా సంతోషంగా ఉన్నానని అన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. తన దృష్టిలో జట్టులో కెప్టెన్ ఆటగాళ్లందరినీ ముందుండి నడిపించాలని, తాను అలాంటి నాయకుడిగా ఉండాలనుకుంటున్నానని వివరించాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆటగాళ్లందరి భుజంపై చెయి వేసి తానున్నాననే నమ్మకం వారిలో కల్పిస్తానని చెప్పాడు. అలాగే తాను బౌలింగ్ కెప్టెన్‌నని, ఫీల్డింగ్ చేసే సమయంలోనే కెప్టెన్ బాధ్యత కీలకమని తాను నమ్ముతానని, అందువల్ల తనను తాను బ్యాటింగ్ కెప్టెన్‌గా కాక, ఫీల్డింగ్ కెప్టెన్‌గానే భావిస్తానని శాంసన్ పేర్కొన్నాడు.


అలాగే ఐపీఎల్‌తో తన అరంగేట్రం గురించి కూడా వెల్లడించాడు. రాజస్థాన్ జట్టుకు తాను ఎంపికైన నేపథ్యం ఎప్పటికీ మర్చిపోలేనని శాంసన్ అన్నాడు. 2013లో తన సహచర ఆటగాడు శ్రీశాంత్‌తో కలిసి ట్రయల్స్‌లో పాల్గొన్నానని, రెండో రోజు ట్రయల్స్ పూర్తయిన తరువాత అప్పటి రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన వద్దకొచ్చి రాజస్థాన్‌కు ఆడాలని కోరారని శాంసన్ వివరించాడు.  ‘సంజు.. నీలో చాలా ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. నీవు మా జట్టుకు ఆడితే బాగుటుందని అనుకుంటున్నా. మా ఫ్రాంచైజీ తరపున ఆడతావా..?’ అని అడిగారు.


 ఆ క్షణం తనకు మతి పోయినంతపనైందని, ద్రవిడ్ అంతటి వ్యక్తి తనను అడగడంతో వెంటనే ఒప్పుకున్నట్లు శాంసన్ చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు తన కెరీర్ అద్భుతంగా సాగుతోందని సంతోషం వ్యక్తం చేశాడు. అందుకే ఇప్పటకీ తన జీవితంలో అత్యంత గొప్ప రోజు ఏదంటే.. ఆ రోజు గురించే చెబుతానంటూ శాంసన్ వివరించాడు.

Updated Date - 2021-04-13T01:39:41+05:30 IST