ఈ మట్టి ధర రూ.250 కోట్లు.. ఇదేమైనా బంగారమా.. అని ఆశ్చర్యపోతున్నారా..? అసలు నిజం ఎంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-01T14:46:09+05:30 IST

రాజస్థాన్‌లోని ఆ నదిని చూసేందుకు..

ఈ మట్టి ధర రూ.250 కోట్లు.. ఇదేమైనా బంగారమా.. అని ఆశ్చర్యపోతున్నారా..? అసలు నిజం ఎంటో తెలిస్తే..

రాజస్థాన్‌లోని ఆ నదిని చూసేందుకు అందరూ పరుగులు పెడుతుంటారు. సూర్యోదయం కాగానే ఈ నదిలోని నీరు బంగారు వర్ణంలో మెరిసిపోతుంటుంది. ఝూంఝునూ జిల్లాలోని ఖెతడి కొండల నడుమ 56 ఏళ్లుగా ప్రవహిస్తున్న ఈ నదిలో అత్యంత విలువైన ఖనిజాలు లభ్యమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలోని మట్టి ఎంతో విలువైనదిగా గుర్తింపుపొందింది. సుమారు 8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ నదీతీరపు మట్టి ధర రూ. 250 కోట్లకు చేరుకుంది. ఒక విదేశీ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో ఈ మట్టిలో బంగారం ఉంటుందని స్పష్టమైంది. ఈ నది ఏర్పడటం వెనుక ఆసక్తికర కథనం ఉంది. రాగి గనుల నుంచి వెలువడే వ్యర్థాలను పైపులు ద్వారా ఇక్కడకు వదిలివేస్తుంటారు. 


ఈ కారణంగానే బంగారు, వెండి లాంటి ఖనిజలవణాలు ఇక్కడ పేరుకుపోతున్నాయని భావిస్తున్నారు.  ఈ విధంగా ప్రతీ ఏటా 30 లక్షల టన్నుల టన్నింగ్ ఇక్కడ పేరుకుపోతుంది. అదంతా కొంతకాలానికి మట్టి రూపాన్ని సంతరించుకుంది. ఈ నది మట్టిలో రాగి 0.13శాతం, ఐరన్ 16.96 శాతం, సల్ఫర్ 1.31 శాతం, అల్యూమినియం 4.53 శాతం, సిలికాన్ 73.54 శాతం, కాల్షియం 7శాతం, మెగ్నీషియం 1.65 పీపీఎం, కోబాల్ట్ 40 పీపీఎం, నికెల్ 29 పీపీఎం, లిడ్ 17 పీపీఎం, బంగారం 0.18 పీపీఎం, సెలీనియం 0.9 పీపీఎంతో సహా ఇతర లోహాలు ఉన్నాయని ఒక సర్వేలో తేలింది. నిధుల కొరత కారణంగా ఈ కంపెనీకి చెందిన పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అయితే గడచిన 56 ఏళ్లుగా వేస్టేజీ వస్తూనే ఉంది. ఒక టన్ను వేస్టేజీ రూ. 202గా ఉంది. ఇక్కడ పేరుకుపోయిన మొత్తం మట్టి విలువ రూ. 250 కోట్లని సమాచారం.


చూసేందుకు ఇక్కడ వ్యర్థాలు ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇక్కడి మట్టి ధర కోట్ల రూపాయలు పలుకుతోంది. ఖెతడిలోని కాపర్ మైన్స్‌ను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్(ఐబీఎం)కు చెందిన జియాలజిస్టులు కనుగొన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1975, ఫిబ్రవరిలో ఈ గనిని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఆర్మీ నుంచి రిటైర్ అయిన 80 ఏళ్ల భగవాన్ రామ్ మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం తాము ఈ డ్యాము దారిలో కట్టెలు తెచ్చేవారమని, అప్పట్లో ఇక్కడ అనేక ఆరావళి పర్వతాలు ఉండేవన్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ కొండంతా నదిలో మునిగిపోయిందన్నారు. దీంతో కొండ పైభాగం మాత్రమే కనిపిస్తున్నదన్నారు. కాగా ఈ గని నుంచి ప్రతీరోజూ కోట్ల రూపాయల విలువైన రాగిని వెలికితీస్తుంటారు. కంపెనీ అధికారులు తెలిపిన వివవరాల ప్రకారం కేసీసీలో రాగిని వెలికి తీసిన అనంతరం మిగిలిన అవశేషాలను ఈ నదిలోకి వదులుతామన్నారు. రాగిని వెలికి తీశాక మిగిలే వ్యర్థాలను టన్నింగ్ అని అంటారు.

Updated Date - 2022-01-01T14:46:09+05:30 IST