నాలుగు రోజులుగా ప్రియురాలు మాట్లాడటం లేదు.. లంచ్ టైంలో ఒంటరిగా కనిపించడంతో.. ప్రియుడు చేసిన ఘోరమిది!

ABN , First Publish Date - 2021-11-24T19:10:19+05:30 IST

తాను ప్రేమించిన యువతి మాట్లాడటం..

నాలుగు రోజులుగా ప్రియురాలు మాట్లాడటం లేదు.. లంచ్ టైంలో ఒంటరిగా కనిపించడంతో.. ప్రియుడు చేసిన ఘోరమిది!

ఇంటర్‌నెట్‌డెస్క్: తాను ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసిందని కోపం పెంచుకున్నాడు. కాలేజీ లంచ్ టైంలో ఎవరూ లేని సమయంలో దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


జిల్లాలోని మార్వార్ జంక్షన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బితోడ కలాన్ గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇద్దరూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అదే పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదవుతున్న ఓ యువకుడు ఆ యువతిపై మనసు పారేసుకున్నాడు. అతడిది వన్‌సైడ్ లవ్. ‘ఇద్దరిదీ ఒకటే కులం. మనం ప్రేమించుకోవడంలో తప్పులేదు’అని ఆ యువతితో అనేవాడు. కానీ ఆ యువతి అవన్నీ పట్టించుకోక తన పని తాను చూసుకునేది. ప్రియుడి వేధింపులు తాళలేక సోదరుడికి విషయం చెప్పింది. అతడు కూడా సీనియర్ విద్యార్థికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రియుడు మారలేదు. నాలుగు రోజులుగా బ్రతిమిలాడుతున్న ఆమె కనీసం అతడివైపు చూడకపోయేసరికి..  కోపం పెంచుకున్నాడు.



మంగళవారం మధ్యాహ్న భోజనం సమయంలో ఆ యువతి ఒంటరిగా ఉండడం గమనించాడు. అంతే.. నీతో మాట్లాడాలంటూ ఆమె దగ్గరికి వెళ్లి బ్లేడు తీసుకుని అతికిరాతకంగా గొంతు కోసేశాడు. గొంతునుంచి భారీగా రక్తస్రావం కావడంతో ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె అరుపులు విని విద్యార్థులతో పాటు టీచర్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స కోసం వెంటనే పాలీలోని బంగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులకు విషయం తెలిసి ఆస్పత్రికి వచ్చారు. కూతురిని చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి వచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పారిపోయిన నిందితుడికోసం గాలించగా అతడు పట్టుబడ్డాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


ప్రస్తుతం యువతికి ప్రాణాపాయం తప్పిందని, ఆహారం తీసుకోవడం కష్టం కాబట్టి గ్లూకోజ్ ఎక్కిస్తున్నామని బంగార్ ఆస్పత్రిలోని ట్రామా వార్డ్‌కు చెందిన డాక్టర్ తెలిపారు. యువతి అదృష్టం బాగుండి ఆహారవాహిక తెగిపోలేదని, ఒకవేళ నిందితుడి చేతిలో ఆహారవాహిక తెగిపోయి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. మొత్తం 20కుట్లు వేశామని, ప్రస్తుతం ఆమెను ట్రామా వార్డ్ నుంచి సర్జీకల్ వార్డ్‌కు తరలించామన్నారు. కుట్లు అధికంగా పడడంతో ప్రస్తుతం ఆ యువతి మాట్లాడలేదని చెప్పారు. 

Updated Date - 2021-11-24T19:10:19+05:30 IST