18 నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు... అయితే అక్కడ మాత్రం బంద్!

ABN , First Publish Date - 2021-01-09T16:37:00+05:30 IST

రాజస్థాన్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో...

18 నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు... అయితే అక్కడ మాత్రం బంద్!

జైపూర్: రాజస్థాన్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్టంలో కోవిడ్-19 కారణంగా 10 నెలల పాటు స్కూళ్లు మూతపడ్డాయి. అయితే ఇప్పుడు జనవరి 18 నుంచి దశలవారీగా స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రాజస్థాన్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు సంగీత బెనీవాల్ పాఠశాలలను తెరవడానికి సంబంధించి కొన్ని దిశానిర్దేశాలు జారీ చేశారు. 


దాని ప్రకారం రాష్ట్రంలోని కంటైన్‌మెంట్ ఏరియాలలో పాఠశాలలు తెరవకూడదు. మిగిలిన ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచినప్పటికీ కొన్ని నిబంధనల మేరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలి. అలాగే తరగతి గదులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. విద్యార్థులు ఒక చోట గుమిగూడకుండా చూడాలి. తరగతులలో సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఈ నిబంధనలను అమలుచేస్తూ స్కూళ్లు తెరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

Updated Date - 2021-01-09T16:37:00+05:30 IST