Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 13:15PM

భారత్-పాక్ సరిహద్దులో ఖాదీతో చేసిన అతిపెద్ద జాతీయ పతాకం

జైసల్మేర్: సైనిక దినోత్సవం సందర్బంగా ఖాదీతో తయారుచేసిన అతిపెద్ద జాతీయ పతాకాన్ని భారత పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని జైసల్మేర్ లోంగేవాలాలో ప్రదర్శించారు.  1971లో భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన చారిత్రక పోరాటానికి లోంగేవాలా వేదికగా నిలిచింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఈ పతాకాన్ని తయారు చేయించి సైనిక దళాలకు అప్పగించింది. 225 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పున్న ఈ మువ్వన్నెల పతాకం సుదూరం నుంచి కూడా కనులవిందు చేస్తోంది.


Advertisement
Advertisement