Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.10 ఇవ్వండి.. పాల ప్యాకెట్ తెచ్చుకుంటా అని భార్య అడిగినందుకు.. ఆమెకు భారీ షాకిచ్చిన భర్త.. ఏం చేశాడో తెలిస్తే..!

ఇంటర్‌నెట్‌డెస్క్: పాల ప్యాకెట్ తెచ్చుకుంటా పది రూపాయలు ఇవ్వండి అని భార్య అడిగింది. నా దగ్గర డబ్బుల్లేవ్.. అంటూ భర్త సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన భర్త ఆమెకు భారీ షాకిచ్చాడు. అతడు ఇచ్చిన షాక్‌కు ఆమె మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


స్థానిక పట్టణంలోని రూప్ నగర్ కాచి ప్రాంతంలో నివసిస్తోన్న మహమ్మద్ హుస్సేన్ కుమారుడు మహమ్మద్ రఫీక్‌కు 1994లో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైనప్పటినుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. అయినా ఓపికగా భరిస్తూ ఆ మహిళ సంసారాన్ని ముందుకు కొనసాగిస్తోంది. నవంబర్ 21న భార్యభర్తల మధ్య మరోసారి తగాదా మొదలైంది. పది రూపాయలు ఇవ్వండి.. పాల ప్యాకెట్ తెచ్చుకుంటా అని భార్య అడగడమే తప్పైంది. నా వద్ద డబ్బుల్లేవ్.. అంటూ భర్త గొడవ పెట్టుకున్నాడు. గొడవ కాస్త పెద్దది కావడంతో.. కోపంలో అతడు ఆమెకు భారీ షాకిచ్చాడు.


నాకు ఈ సంసారమే వద్దు.. అంటూ మూడుసార్లు తలాక్ చెప్పి ఇంటినుంచి గెంటేశాడు. భర్త ఇచ్చిన షాక్‌కు ఆమె మైండ్ బ్లాంక్ అయ్యింది. ‘నీ డబ్బులొద్దు.. ఏం వద్దు.. నన్ను ఇంట్లోకి రానివ్వండి’అంటూ ఆమె ఎంత ప్రాధేయపడినా అతడు ఒప్పుకోలేదు. దీంతో ఆమె చేసేదేమి లేక నేరుగా సుఖేర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన విషయం చెప్పి భర్తపై కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


సుఖేర్ పోలీస్‌స్టేషన్ ఎస్సై రోషన్‌లాల్ మాట్లాడుతూ పాల ప్యాకెట్ విషయంలో భార్యభర్తల మధ్య గొడవజరిగిందని, ఆవేశంలో మహమ్మద్ రఫీక్ తలాక్ చెప్పి భార్యను ఇంటినుంచి గెంటేశాడని చెప్పారు. మరిన్ని వివరాలకోసం భార్యను అడుగుతున్నా ఆమె ఏ సమాధానం చెప్పడంలేదని, భర్తను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి అసలేం జరిగిందో కనుక్కుంటామని చెప్పారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement