Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్ధరాత్రి వివాదం.. భార్యను కడతేర్చిన భర్త..!

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : భార్యను ఇనుప రాడ్‌తో తలపై మోది హత్యచేశాడో భర్త. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సంచలనం రేపింది. బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌ బస్తీకి చెందిన మామిల జంగయ్య యాదవ్‌, మీనా(47)భార్యాభర్తలు. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె సోదరి మీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు, మీనాకు ముగ్గురు సంతానం ఉన్నారు. కొన్ని రోజులుగా జంగయ్య అనారోగ్యంతోపాటు మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో దంపతులిద్దరి మధ్య బుధవారం అర్ధరాత్రి కుటుంబ విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన జంగయ్య క్షణికావేశంలో మీనా తలపై ఇనుప పారతో బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం జరిగి మీనా ఒక్కసారిగా ఇంట్లోనే కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త జంగయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement