Abn logo
May 14 2021 @ 11:21AM

భార‌తీయుడికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన.. లండ‌న్ మేయ‌ర్‌

లండ‌న్: గ‌త వారం జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచి వ‌రుస‌గా రెండోసారి లండ‌న్ మేయ‌ర్‌గా ఎన్నికైన సాదిక్ ఖాన్‌.. భార‌త సంత‌తి వ్య‌క్తి, పారిశ్రామిక వేత్త రాజేష్ అగ‌ర్వాల్‌కు తాజాగా కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రాజేష్‌ను డిప్యూటీ మేయ‌ర్ ఫ‌ర్ బిజినెస్‌గా ఎంపిక చేశారు. కాగా, రాజేష్ ఈ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఇది వ‌రుస‌గా రెండోసారి. ఇక త‌న‌కు ఈ ప‌ద‌వి ద‌క్క‌డం ప‌ట్ల రాజేష్ ఆనందం వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణ‌మైన లండ‌న్ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. గ‌డిచిన ఐదేళ్లు ఇదే ప‌దవిలో లండ‌న్ వాసుల‌కు తాను చేసిన సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా రాజేష్ గుర్తు చేసుకున్నారు. మ‌హ‌మ్మారి క‌ల్లోలం వేళ త‌లెత్తిన ఆరోగ్య‌, ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను తాము అధిగ‌మించిన తీరు అమోఘం అని పేర్కొన్నారు. త‌న‌పై న‌మ్మ‌కంతో రెండోసారి ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాజేష్ స్వ‌స్థ‌లం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్. 

తాజా వార్తలుమరిన్ని...

Advertisement