Apr 12 2021 @ 08:06AM

16 ఏళ్ల త‌ర్వాత పోటీ ప‌డుతున్న ర‌జినీ, క‌మ‌ల్‌

అగ్ర క‌థానాయ‌కులు సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ పోటీ ప‌డుతున్నారు. అయితే వీరి పోటీ రాజ‌కీయాల్లో కాదు.. సినిమాల్లో. వివ‌రాల్లోకి వెళితే, ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న అణ్ణాత్త సినిమా విడుద‌ల‌వుతున్న‌ట్లు నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు క‌మ‌ల్‌హాస‌న్, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న విక్ర‌మ్ సినిమా కూడా దీపావ‌ళి బ‌రిలోకి దిగుతున్న‌ట్లు వార్త‌లు కోలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే రజినీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు బాక్సాఫీస్ వ‌ద్ద 16 ఏళ్ల త‌ర్వాత పోటీ ప‌డ్డ‌ట్లు అవుతుంది. 2005లో ర‌జినీకాంత్ చంద్ర‌ముఖి.. క‌మ‌ల్‌హాస‌న్ ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమాల‌తో పోటీ ప‌డితే, ర‌జినీకాంత్..‘చంద్ర‌ముఖి’ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కాగా.. క‌మ‌ల్‌హాసన్ ‘ముంబై ఎక్స్‌ప్రెస్’ డిజాస్ట‌ర్ అయ్యింది. మరి ఈసారి దీపావళి విన్నర్ ఎవరవుతారో తెలియాలంటే వేచి చూడాలి.