Abn logo
Jun 3 2020 @ 16:16PM

ర‌జినీకాంత్, క‌మ‌ల్‌హాస‌న్‌ మూవీ రీమేక్‌

1978లో దీపావళి రోజున విడుదలైన కమల్‌హాసన్‌, శ్రీప్రియ జోడీగా నటించిన సూపర్‌హిట్‌ తమిళ చిత్రం ‘అవల్‌ అప్పడిదాన్‌’. రుద్రయ్య దర్శకత్వం వహించిన ఆ చ్రితంలో రజనీకాంత్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ ఏజెన్సీ నిర్వాహకుడి పాత్రలో నటించారు. శ్రీప్రియ  అతని కంపెనీలో ఉద్యోగినిగా నటించింది. కమల్‌హాసన్‌ డాక్యుమెంటరీ దర్శకుడి పాత్ర  పోషించారు. ఇంతటి విశేషాలు సంతరించుకున్న ఆ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నట్టు దర్శకుడు బద్రీ వెంకటేష్‌ తెలిపారు. అధర్వా, సమంతా నటించిన బాణాకాత్తాడి చిత్రానికి బద్రీ వెంకటేష్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అవల్‌ అప్పడిదాన్‌ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రీమేక్‌లో రజనీకాంత్‌ రోల్‌లో శింబును, కమల్‌హాసన్‌ రోల్‌లో దుల్హర్‌సల్మాన్‌ను, శ్రీప్రియపాత్రలో శ్రుతిహాసన్‌తో నటింపచేయాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement