May 5 2021 @ 00:39AM

అమెరికా వెళుతున్న రజనీ!

హైదరాబాద్‌లో జరుగుతున్న ‘అన్నాత్త’ షూటింగ్‌ చివరి షెడ్యూల్‌లో పాల్గొంటున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ త్వరలో అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. ఇప్పటికే అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రజనీ.. సాధారణ వైద్యపరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ 20 రోజుల బసచేసి వైద్యపరీక్షలు పూర్తిచేసుకొని చెన్నైకు తిరిగిరానున్నట్లు కోలీవుడ్‌వర్గాలు తెలిపాయి. స్వదేశం రాగానే ఆయన తన కొత్త చిత్రం గురించి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అన్నాత్త చిత్రం షూటింగ్‌ పూర్తి కాగానే ఆయన అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం.