May 17 2021 @ 13:45PM

కరోనాపై పోరు.. 50 లక్షలు విరాళమిచ్చిన తలైవా

త‌మిళ‌నాడులో క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వానికి త‌న మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తూ త‌మిళ‌నాడు ప‌బ్లిక్ రిలీఫ్ ఫండ్‌కు త‌లైవా ర‌జినీకాంత్ యాబై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా అందించారు. సోమ‌వారం ముఖ్య‌మంత్రి ఎం.కె.స్టాలిన్‌ను క‌లుసుకున్న ర‌జినీకాంత్ ఈ విరాళాన్ని అందించారు. ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుని తెలియ‌జేసి పాండమిక్ నుంచి బ‌య‌ట ప‌డాల‌ని ఆయ‌న కోరారు. ఇప్ప‌టికే హీరో అజిత్ పాతిక ల‌క్ష‌లు, శివ కార్తికేయ‌న్ పాతిక ల‌క్ష‌లు, హీరో సూర్య కుటుంబం కోటి రూపాయ‌లు, ర‌జినీకాంత్ కుమార్తె సౌంద‌ర్య ర‌జినీకాంత్ రూ.కోటి విరాళంగా అందించారు. సెల‌బ్రిటీల‌తో పాటు ప‌లువురు సామాన్యులు కూడా త‌మ వంతుగా విరాళాల‌ను అందిస్తుండ‌టం విశేషం.