రజినీ సంచలన ట్వీట్.. జనవరిలో కొత్త పార్టీ లాంచ్

ABN , First Publish Date - 2020-12-03T18:08:46+05:30 IST

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు న్యూ ఇయర్ కానుక ప్రకటించారు. రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు.

రజినీ సంచలన ట్వీట్.. జనవరిలో కొత్త పార్టీ లాంచ్

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు న్యూ ఇయర్ కానుక ప్రకటించారు. రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఆయన... ఎట్టకేలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. జనవరిలో పార్టీ ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. రజనీ ట్వీట్‌తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 



Updated Date - 2020-12-03T18:08:46+05:30 IST