May 14 2021 @ 22:44PM

తండ్రీ కూతుళ్లు చెరో రూ. కోటి సాయం

కొవిడ్‌పై పోరాటంలో భాగంగా తమవంతు సాయం చేసేందుకు పలువురు తమిళ నటులు ముందుకొచ్చారు. శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రజనీకాంత్‌, ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ తన భర్త విశాగన్‌ వనంగముడితో కలసి చెరో రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. ఆమె శుక్రవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలసి రూ. కోటి చెక్కును అందచేశారు. రజనీకాంత్‌ కూడా సౌందర్య రజనీకాంత్‌ ద్వారా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చెక్‌ అందజేశారు. రజనీకాంత్‌ ఇటీవలె ‘అన్నాత్తే’ షూటింగ్‌ పూర్తి చేశారు.


ప్రముఖుల విరాళాలు

తమిళ నటులు అజిత్‌, ఉదయనిధి స్టాలిన్‌, దర్శకుడు ఎ. ఆర్‌ మురగదాస్‌ రూ. 25 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.