మధ్యప్రదేశ్ గవర్నర్‌గా రాజీవ్ మహర్షి?

ABN , First Publish Date - 2020-08-09T16:47:41+05:30 IST

మధ్యప్రదేశ్ గవర్నర్ గా రాజీవ్ మహర్షిని నియమిస్తున్నట్లు సమాచారం. ఈయన రిటైర్డ్

మధ్యప్రదేశ్ గవర్నర్‌గా రాజీవ్ మహర్షి?

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ గవర్నర్ గా రాజీవ్ మహర్షిని నియమిస్తున్నట్లు సమాచారం. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అంతేకాకుండా కంప్ర్టోటర్ ఆడిటర్ జనరల్‌గా (కాగ్) కూడా పనిచేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్‌ లాల్జీ టాండన్ మృతి చెందడంతో అక్కడి గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. అందుకే మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మహర్షిని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ఆయన శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.


మధ్యప్రదేశ్ గవర్నర్ గా కుదరని పక్షంలో మహర్షిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా ఉన్న బైజల్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్ గా పంపిస్తారని తెలుస్తోంది. కంప్ర్టోలర్ ఆడిటర్ జనరల్‌గా రాజీవ్ మహర్షి శుక్రవారమే పదవీ విరమణ పొందారు. వీరి స్థానంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన గిరీశ్ చంద్ర ముర్ము కాగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 


రాజీవ్ మహర్షి 1978 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా, హోంశాఖ కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా మహర్షికి పేరుంది. 

Updated Date - 2020-08-09T16:47:41+05:30 IST