రాజీవ్‌ రహదారిని సుందరంగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-06-19T05:47:06+05:30 IST

రాజీవ్‌రహదారిపై ఇరువైపులా, డివైడర్‌పై అందమైన మొక్కలను పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి మున్సిపల్‌ అధికారులకు సూచించారు.

రాజీవ్‌ రహదారిని సుందరంగా తీర్చిదిద్దాలి
గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని రాజీవ్‌రహదారిపై మొక్కలు నాటేందుకు పాదులు తీస్తున్న ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి

‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి

గజ్వేల్‌, జూన్‌ 18: రాజీవ్‌రహదారిపై ఇరువైపులా, డివైడర్‌పై అందమైన మొక్కలను పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి మున్సిపల్‌ అధికారులకు సూచించారు. రాజీవ్‌ రహదారిపై పిచ్చిమొక్కల తొలగింపు, మొక్కలు పోయిన చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్‌రహదారిని అందంగా తీర్చిదిద్దుతామన్నారు. అటవీ, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయనవెంట కమిషనర్‌ వెంకటగోపాల్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-06-19T05:47:06+05:30 IST