దేశానికి రావత్ చాలా సేవ చేశారు: రక్షణమంత్రి రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2021-12-09T00:09:41+05:30 IST

తమిళనాడు కూనూరు సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 13 మంది కన్నుమూశారు. హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా 13 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్..

దేశానికి రావత్ చాలా సేవ చేశారు: రక్షణమంత్రి రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణంపై దేశంలోని ప్రముఖులు సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా బిపిన్ రావత్ సేవలను గుర్తు చేసుకున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మొట్టమొదటి సీడీఎస్ జనరల్‌గా బిపిన్ రావత్ సాయుధ దళాల ఉమ్మడి భాగస్వామ్యం కోసం ప్రణాళికలను సిద్ధం చేశారు. జనరల్ రావత్ దేశానికి అసాధారణమైన సేవలు అందించారు’’ అని ట్వీట్ చేశారు.


మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్పందిస్తూ ‘‘సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌ సహా ఆయన భార్య, ఇతర ఆర్మీ సిబ్బంది మరణించారని తెలిసీ చాలా బాధపడ్డాను. అత్యుత్తమమైన సైనికుల్లో ఒకరిని దేశం కోల్పోయినందుకు దేశం దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.


తమిళనాడు కూనూరు సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 13 మంది కన్నుమూశారు. హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా 13 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులిక ఉన్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన బిపిన్ రావత్‌ను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రావత్ మృతి చెందినట్లు సమాచారం.

Updated Date - 2021-12-09T00:09:41+05:30 IST