కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2021-03-02T22:00:53+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్ల వయసు నిండిన వారికి, దీర్ఘకాలిక రోగాలుండి 45 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి రెండో దశ కరోనా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం కొనసాగుతోంది. రెండో దశలో 270 మిలియన్ల మందికి వ్యాక్సిన్

కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో ఆయనకు అక్కడి సిబ్బంది వ్యాక్సిన్ ఇచ్చారు. రాజ్‌నాథ్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఈ వ్యాక్సీన్ తీసుకున్నారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అనేక మంది కేంద్ర ప్రభుత్వ ప్రముఖలు, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖ రాజకీయవేత్తలు కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకున్నారు.


కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్ల వయసు నిండిన వారికి, దీర్ఘకాలిక రోగాలుండి 45 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి రెండో దశ కరోనా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం కొనసాగుతోంది. రెండో దశలో 270 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించనున్నారు.వ్యాక్సిన్ అపాయింట్ మెంటు బుక్ చేసుకున్నాక నేరుగా కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోమవారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మంగళవారం పలు రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు, సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలు వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Updated Date - 2021-03-02T22:00:53+05:30 IST