‘2డీజీ’ కరోనా ఔషధాన్ని విడుదల చేసిన రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2021-05-17T21:30:30+05:30 IST

డీఆర్డీవో తయారు చేసిన కరోనా నివారణ ఔషధం ‘2డీజీ’ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు

‘2డీజీ’ కరోనా ఔషధాన్ని విడుదల చేసిన రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : డీఆర్డీవో తయారు చేసిన కరోనా నివారణ ఔషధం ‘2డీజీ’ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఈ ఔషధాన్ని  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు ఇవ్వగా, హర్షవర్ధన్ దానిని ఎయిమ్స్ డైరెక్టర్‌ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ... కరోనా కట్టడిలో ఈ ఔషధం ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి ఓ ఔషధాన్ని ఉత్పత్తి చేయడం ఆరోగ్యవంతమైన భాగస్వామ్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రకటించారు. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ... 2డీజీ ఔషధంతో కొవిడ్ రికవరీ తగ్గడంతో పాటు ఆక్సిజన్ అవసరం కూడగా తగ్గుతుందని, కోవిడ్ పై పోరులో డీఆర్డీవో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అయితే ఈ ‘2డీజీ’ (2-డియాక్సీ డి-గ్లూకోజ్) ఔషధ ధరను మాత్రం డీఆర్డీవో ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దేశంలో కోవిడ్ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో డీఆర్డీవో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. 

Updated Date - 2021-05-17T21:30:30+05:30 IST