దేశ భద్రతకు సెలా సొరంగం కీలకం : రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2021-10-15T00:18:22+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా సొరంగం కోసం అత్యంత

దేశ భద్రతకు సెలా సొరంగం కీలకం : రాజ్‌నాథ్

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా సొరంగం కోసం అత్యంత ముఖ్యమైన పేలుడు గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్ పర్యవేక్షణలో జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు, అరుణాచల్ సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి ఈ సొరంగం దోహదపడుతుందని చెప్పారు. 


అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కామెంగ్ జిల్లాలో సెలా సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీనిని నిర్మిస్తున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)ను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో రికార్డు స్థాయి ఎత్తులో రోడ్లు, వంతెనలు, సొరంగాలు, వైమానిక స్థావరాలను నిర్మిస్తూ దేశ ప్రగతికి కృషి చేస్తోందన్నారు. కనెక్టివిటీ మ్యాపుల్లో సుదూర ప్రాంతాలు కనిపించేలా చేస్తోందన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పటిష్టపరచడంలో బీఆర్ఓ చేస్తున్న కృషి వల్ల భారతీయ దళాల పోరాట సన్నద్ధత పెరుగుతోందని, సుదూర ప్రాంతాల్లో పర్యాటక రంగం వృద్ధి చెందుతోందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. 


బీఆర్ఓ నిర్వహిస్తున్న 20,000 కిలోమీటర్ల మోటార్‌సైకిల్ యాత్రను రాజ్‌నాథ్ గురువారం ప్రారంభించారు. 


Updated Date - 2021-10-15T00:18:22+05:30 IST