Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 25 2021 @ 15:21PM

ఆఫ్ఘన్ పరిణామాలపై రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అధికార రాజకీయాల పాత్ర, ప్రభుత్వ నిర్మాణాలను, ప్రవర్తనను మార్చేందుకు ఓ సాధనంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించడం గురించి ప్రశ్నలు ఉదయిస్తున్నాయన్నారు. నేషనల్ డిఫెన్స్ కళాశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు. 


రాడికల్, టెర్రర్ గ్రూపులకు పాకిస్థాన్ మద్దతుపై భారత దేశ ఆందోళన పట్ల అవగాహన పెరుగుతోందని రాజ్‌నాథ్ చెప్పారు. బాధ్యతలేని దేశాలు ఈ ప్రాంతంలో సంక్షోభానికి కారణమవుతున్నాయని పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు దురాక్రమణ వ్యూహాలతో, ప్రభుత్వేతర శక్తులకు చురుగ్గా మద్దతిస్తూ, ఈ ప్రాంతంలో సంక్షోభానికి కారణమవుతున్నాయన్నారు. 


ఉగ్రవాదం వల్ల ఏ విధంగా అస్థిరత్వం ఏర్పడుతోందో నేటి ప్రపంచం చూస్తోందని చెప్పారు. హింసాత్మక రాడికల్ శక్తులు నూతన సిద్ధాంతాలను సృష్టించడం ద్వారా న్యాయ సమ్మతిని సాధించేందుకు ప్రయత్నిస్తుండటం ప్రమాదకర దృష్టాంతమని తెలిపారు. ఉమ్మడి సవాళ్ళకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉందని బాధ్యతాయుతమైన దేశాల మధ్య విస్తృత అవగాహన ఏర్పడిందని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు ప్రస్తుత వాస్తవాలను మరింత బలంగా వివరిస్తున్నాయన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయనేది సుస్థిర విషయమని వ్యాఖ్యానించారు. దేశాల సరిహద్దులు నేడు తరచుగా మారే అవకాశం లేకపోవచ్చునన్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement