ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంటులో రాజ్‌నాథ్ ప్రకటన!

ABN , First Publish Date - 2021-12-08T19:48:02+05:30 IST

తమిళనాడులో బుధవారం సైనిక హెలికాప్టర్ కూలిపోయిన

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంటులో రాజ్‌నాథ్ ప్రకటన!

న్యూఢిల్లీ : తమిళనాడులో బుధవారం సైనిక హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. ఈ హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ సహా మొత్తం మీద దీనిలో 14 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో నలుగురు మరణించినట్లు, ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. 


ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. జనరల్ రావత్ ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఈ హెలికాప్టర్లో ప్రయాణించారు. ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) దర్యాప్తునకు ఆదేశించింది. ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఐఏఎఫ్ ఎంఐ-17వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదానికి గురైందని పేర్కొంది. దీనిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు తెలిపింది. కోయంబత్తూరు-సూలూరు మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. 


Updated Date - 2021-12-08T19:48:02+05:30 IST