Abn logo
Sep 19 2021 @ 00:52AM

‘రాజ్యసభ’ పోటీకి బీజేపీ రెడీ

యానాం, సెప్టెంబరు 18: పుదుచ్చేరి రాజ్యసభ సీటుకు సంబంధించి రాజకీయంగా వేడెక్కుతుంది. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌తో పాటు బీజేపీ  కూడా పోటీకి సైఅంటున్నాయి. పుదుచ్చేరి బీజేపీ పార్టీ అధ్యక్షుడు స్వామినాథన్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాజ్యసభకు పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మె ల్యేలు,  మద్దతు ఇచ్చిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 12మంది ఎమ్మెల్యేలు బీజేపీకి  బలం ఉంది. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ సహరించాలని సీఎంకు వినతిపత్రాన్ని అందించారు. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పేరు వినిపిస్తున్నప్పటికీ బీజేపీ కూడా పోటీకి సైఅనడంపై రాజకీయం వేడెక్కింది. దీనిపై సీఎం, బీజేపీ ఏవిధంగా ముందుకు వెళ్తారో వేచిచూడాలి.