20 నెలల్లో 14 అంతస్థుల భవనం.. కట్టలేకపోతే కంపెనీకి వారానికి రూ.2 కోట్ల జరిమానా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు

ABN , First Publish Date - 2021-10-26T17:23:20+05:30 IST

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3ఏళ్లు పూర్తయ్యాయి. మరో రెండేళ్ల అక్కడి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో

20 నెలల్లో 14 అంతస్థుల భవనం.. కట్టలేకపోతే కంపెనీకి వారానికి రూ.2 కోట్ల జరిమానా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3ఏళ్లు పూర్తయ్యాయి. మరో రెండేళ్ల అక్కడి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే నిబంధనలను రూపొందించింది. గెహ్లాట్ ప్రభుత్వం తయారు చేసిన నిబంధనలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఏం జరుగుతుందా అని అక్కడి ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లో మరో రెండేళ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 32 అంతస్థుల హాస్పిటల్‌ను ఆ రాష్ట్ర ప్రజలకు సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే గెహ్లాట్ ప్రభుత్వం కొన్ని నిబంధనలను తయారు చేసింది. ఆ నిబంధనల ప్రకారం.. కాంట్రాక్ట్ పొందిన నిర్మాణ సంస్థ, తొలి 20 నెలల్లోనే 14 అంతస్థుల భవనం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిగిలిన 8 అంతస్థుల నిర్మాణాన్ని మరో 10 నెలల్లో పూర్తి చేయాలి. ఒకవేళ సదరు నిర్మాణ సంస్థ మొదటి 20 నెలల్లో 14 అంతస్థులను నిర్మించలేకపోతే... వారానికి రూ.2కోట్ల చొప్పున ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


మొత్తం 32 అంతస్థుల ఆసుపత్రి భవనాన్ని ముందుగా సూచించిన సమయానికి పూర్తి చేయని పక్షంలో నెలకు రూ.8కోట్ల చొప్పున సదరు నిర్మాణ ప్రభుత్వానికి జరిమానా కట్టాల్సి ఉంటుంది. కాగా.. ఈ ప్రాజెక్ట్‌పై ఆ రాష్ట్ర మంత్రి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జైపూర్‌లో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి భవన నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తైతే ఎయిర్ ఆంబులెన్సులు ఆసుపత్రిపై ఎయిర్ ఆంబులెన్సులు ల్యాండ్ అయ్యే దృశ్యాలు చూడవచ్చని పేర్కొన్నారు. 



రూ.500 కోట్లతో నిర్మించనున్న ఈ ఆసుపత్రి‌లో 100 రిజిస్ట్రేషన్ కౌంటర్‌లు, 1200 బెడ్‌లు (100 డీలక్స్ రూమ్‌లు, 80 ప్రీమియం రూమ్‌లు), 20 ఆపరేషన్ థియేటర్లు, హెలిప్యాడ్లు, మెడికల్ సైన్స్ మ్యూజియం, ఫుడ్‌ఫ్టా ప్లాజా తదితర సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఆసుపత్రి నిర్మాణానికి స్మార్ట్ సిటీ కంపెనీ రూ.126కోట్లు అందించనుండగా.. హౌసింగ్ బోర్డ్ మరో వంద కోట్లను సమకూర్చనున్నట్లు సమాచారం.




Updated Date - 2021-10-26T17:23:20+05:30 IST